HomeMovie News'కన్నప్ప' : రన్ టైం 12 నిముషాలు తగ్గింపు

‘కన్నప్ప’ : రన్ టైం 12 నిముషాలు తగ్గింపు

- Advertisement -

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. జూన్ 27న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.

అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా యొక్క రన్ టైం 195 నిమిషాలు ఉంటుందని గతంలో ప్రకటించారు. కాగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న అనంతరం ఈ సినిమాని 12 నిమిషాల 11 సెకండ్లు తగ్గించి ఓవరాల్ గా 182 నిమిషాల 51 సెకండ్లకు కుదించారు.

ఇక ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు ప్రతి ఒక్క పాత్ర ఆకట్టుకుంటుందని అలానే నేషనల్ వైడ్ గా కన్నప్ప మంచి విజయం అందుకోవటం ఖాయమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి రిలీజ్ అనంతరం కన్నప్ప మూవీ ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి

See also  'హరి హర వీరమల్లు' న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories